సిరాన్యూస్, సైదాపూర్
వెంకటేశ్వర్లపల్లికి తాగునీరు సరఫరా
* మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నీటి సరఫరా చేయించారు. గతంలో గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నందున మంత్రి పొన్నం ప్రభాకర్ 1,50,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గురువారం గ్రామంలో ఉన్న నల్లల బావి వద్ద 10 హెచ్‌పీ మోటార్ ను అమర్చారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.