సిరాన్యూస్, హుస్నాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జూన్ 2న తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలు గా జరుపుకోవాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 10 సంవత్సరాల తరువాత ప్రజలు కోరుకున్న , ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు ఘననివాళులు అర్పిస్తున్నానని తెలియజేశారు. తెలంగాణ వేడుకలు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలి కోరారు. తెలంగాణ ఏర్పాటు అనేది దీర్ఘకాలిక ఆకాంక్ష ఆ కోరిక, ఆ కోరికను నెరవేర్చిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపారు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ,ప్రభుత్వం పక్షాన తెలంగాణ ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేస్తునని అన్నారు.