సిరా న్యూస్, సైదాపూర్:
హుజరాబాద్కు బస్సును మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
* రోడ్డుకు మరమ్మతులు చేయించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్
హుస్నాబాద్ టు హుజరాబాద్ వయా సర్వాయిపేట్ గ్రామాల నుండి తిరగబోయే నూతన ఆర్టీసీ బస్సును రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంజూరు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ తన సొంత ఖర్చులతో చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకు ఆర్టీసీ ప్రయాణం సురక్షితంగా ఉండాలని రోడ్డుకి ఇరువైపులా ఉన్న పిచ్చిచెట్లను జేసిబి సహాయంతో తొలగించి, గుంతలున్న రోడ్డును మట్టితో చదును చేయించారు. బస్సు మంజూరు కై కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.