సిరాన్యూస్,చిగురుమామిడి
త్యాగానికి సత్యానికి ప్రతీక బక్రీద్ :మంత్రి పొన్నం ప్రభాకర్
త్యాగానికి సత్యానికి ప్రతీక బక్రీద్ పర్వదినమని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం బక్రీద్ పండగ సందర్భంగా హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు షాబోద్దీన్,కోహెడ మండల సోషల్ మీడియా కన్వీనర్ రఫిక్ లకు బక్రీద్ సందర్భంగా కేక్ తినిపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సమాజ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిట్టిమల్ల రవీందర్, ఎన్ ఎస్ యు ఐ మండల నాయకులు గట్టు ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.