సిరాన్యూస్, హుస్నాబాద్:
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ పట్టణంలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారికి పట్నం సమర్పించుకొని బోనంకొండ నెత్తిననెత్తుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.