సిరాన్యూస్,భీమదేవరపల్లి
పీవీ సేవలు మరవలేనివి: మంత్రి పొన్నం ప్రభాకర్
* ఎమ్మెల్యే అని గర్వంగా చెప్పుకునేలా పని చేస్తా
* ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
మాజీ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు భారత దేశానికి చేసిన సేవలు మరవలేనివని మంత్రి పోన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్భంగా ఆయన స్వగ్రామం భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన నివాసంలో పీవీ విగ్రహానికి మంత్రి పోన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పీవీ నర్సింహారావు చేసిన సంస్కరణలు,ఆయన పాలన దక్షత పై కొనియాడారు. ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించిన మాజీ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే నన్ను బంధించి చెంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడు పీవీ నరసింహారావు గురించి తెలుసుకున్న ఎప్పుడైనా ఆయన స్వగ్రామం వెళ్ళాలని అప్పుడే అనుకున్న అని అన్నారు. మైనార్టీ లో వున్న ప్రభుత్వాన్ని నడిపిన దమ్మున్న వ్యక్తి పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉన్న ప్రభుత్వాన్ని నడపడం కోసం కెసిఆర్ నుండి నేటి వరకు తంతూ కొనసాగుతూనే ఉందని వ్యంగ్యం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పీవీ నరసింహారావు మనందరికీ ఆదర్శం అని, పీవీ అంటే ప్రపంచం మొత్తంలో అపరమేధావని కొనియాడారు.. పీవీ ఇంట్లో జయంతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడ వేడుకలతో పాటుగా ఇక్కడి గ్రామ సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా శ్రమిస్తానని పేర్కొన్నారు..పీవీ 14భాషలతో పాటు 15వ భాష మౌనం గా ఉండడం కూడా తెలుసు అని హాస్యం పండించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి చొక్కా రావు,వెంకటస్వామితో నేను శిష్యరికం చేసిన వారితో పీవీ అత్యంత సన్నిహితం వుంది అని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో నేను మాట ఇచ్చిన ఇక్కడి ప్రజలు ఎక్కడికైనా వెళితే మిది ఎక్కడ అంటే హుస్నాబాద్ నియోజకవర్గం అని చెప్పుకునేలా చేస్తా అని గుర్తు చేసారు. మీ ఎంఎల్ఏ పొన్నం ప్రభాకర్ అని గర్వంగా చెప్పుకునేలా పని చేస్తా అని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య, సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజుల, తదితర జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.