సిరా న్యూస్, హుస్నాబాద్
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూస్తా
* బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వేసవి కాలం లో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని వెక్కేపల్లి, సైదాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో 18 పనులకు 75 లక్షల విలువైన కిచెన్ షెడ్లు, టాయిలెట్ల నిర్మాణం, ఓపెన్ జిమ్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సైదాపూర్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతతో అన్ని పనులు పూర్తి చేస్తున్నామని, మీ అందరి ఆశీర్వచనం వల్లనే ఎమ్మెల్యే గా గెలిచానన్నారు. పార్టీలో సీనియర్ కావడం వల్ల మంత్రి ని అయ్యానని, రాజకీయాలకు అతీతంగా ఎలాంటి ఇబ్బందులూ ఉన్న నాకు చెప్పవచ్చు అన్నారు. పార్టీ సీనియర్ ఎంతగా బిజీ గా ఉన్న నియోజకవర్గ సమస్యలపై ఏమున్నా చెప్పవచ్చునన్నారు.హుస్నాబాద్ లో ఉన్న సిద్దిపేట మండలాలకు నేను ఎమ్మెల్యే అయినా,కలెక్టర్ ఎమ్మెల్యే గా ఉండి పనులు చేపించాలని చెప్పారు. కరీంనగర్ లో ఉన్న మండలాల విషయంలో కూడా కలెక్టర్ పనులు చేపించాలి. వేసవి కాలం లో నీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ రాగానే వర్షాలు రాకుండా కరువుకు కారణం కాంగ్రెస్ కాదు అన్నారు. సెప్టెంబర్ లో కాంగ్రెస్ అధికారంలో లేదు నీళ్ల సమస్య ఊర్లలో రాకూడదని,వాళ్ళు ఏమి అడిగిన చేయాలని,ఒక్క బిందె పట్టుకొని బయటకు వచ్చే సమస్య రావద్దని, నీళ్ల సమస్య రాకుండా నియోజకవర్గానికి 3.5 కోట్లు తీసుకొచ్చానన్నారు. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి పాఠశాలల సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసని కిచెన్ ,టాయిలెట్స్ పూర్తి చేయాలన్నారు. హస్నాబాద్ లో ఉన్న ఏ పాఠశాల కి ఏమ్ కావాలన్న తనకి చెప్పాలని,విద్యకు మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సాగునీరు సమస్యను రాకుండా త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్స్ పూర్తి కావాలని, ఎల్ సీఎస్ ఆర్ ఫండ్స్ ,బాల వికాస వారితో కూడా మాట్లాడమన్నారు.మీరు ఏ నియోజకవర్గం వెళ్లిన మీ గౌరవం పెంచుతా అన్నారు.ఇప్పుడు ఎక్కడున్నా మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కదా అని చెపుతున్నారు.ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాలల మరమత్తులు అన్ని పూర్తి చేస్తామన్నారు.ఆర్టీసి లో ఉచిత ప్రయాణం,ఇందిరమ్మ ఇళ్లు ,500 కే గ్యాస్ ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుంది ఒక మా ప్రభుత్వమే అన్నారు.16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు ఘనత మాకే దక్కుతుందని అన్నారు.ఎక్కడెక్కడ బస్సులు లేవో అక్కడ బస్సులు వేసి ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తానన్నారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ,జిల్లా ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.