సిరాన్యూస్, కరీంనగర్
జడ్పీటీసీ, ఎంపీపీలను సన్మానించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ కనుమల విజయ గణపతి, వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, జడ్పీటీసీ ,ఎంపీపీ లను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘనంగా వారిని సత్కరించారు. ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు చేసి మంచిపేరు తెచ్చుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.