సిరాన్యూస్, సైదాపూర్
రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
సైదాపూర్ మండలం గొడిశాల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నెల్లి రామకృష్ణ శనివారం భారతదేశ సరిహద్దులో మృతి చెందారు. ఈవిషయం తెలిసిన రాష్ట్ర రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశభక్తి తో మాతృభూమి రక్షణ కై సైన్యం లో చేరిన రామ కృష్ణ మరణించడం బాధాకరం అన్నారు. రామకృష్ణ పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని కోరారు.