Ponnam Prabhakar: ఓవర్ హెడ్ టాంక్ లు ఏర్పాటు చేయాలి

సిరాన్యూస్‌, కోహెడ
ఓవర్ హెడ్ ట్యాంక్‌లు ఏర్పాటు చేయాలి
* మంత్రి పొన్నం ప్రభాకర్

గ్రామాల‌లో ఓవర్ హెడ్ ట్యాంక్‌ లు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమ‌వారం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈసంద‌ర్భంగా గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు అడిగి మరి తెలుసుకున్నారు. శనిగరం పెద్ద చెరువును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై అరా తీశారు. అనంతరం శనిగరం గ్రామంలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని , అక్కడ అవసరమైన బోర్వెల్స్ వేసుకోవడంతో పాటు అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సెక్రెటరీ తో పాటు స్పెషల్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాలల్లో తరగతి గదులకు , కలర్స్ వేయడంతో పాటు టాయిలెట్స్ నిర్మించుకునేలా చూడాలన్నారు. గ్రామంలో ఫిష్ మార్కెట్ తో పాటు ,ఓవర్ హెడ్ ట్యాంక్‌లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కోడ్ అయిపోగానే సమస్యలు పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *