బీడుగా మారిన పంటపోలాలు
సిరా న్యూస్,నెల్లూరు;
ఏపీ జెన్కో విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించిన యాష్ పాండ్ కట్ట శనివారం తెగిపోయింది. ఘటనాస్థలాన్ని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపరిశీలించారు.
సోమిరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో కట్టను ఏర్పాటు చేశారు ఆ సమయంలో అధికారులు పరిశీలించకపోవడంతో నాసిరకమైన పనులు జరిగాయి. షాస్ పాండ్ నాసిరికంగా పనులు జరిగాయని కొట్టొచ్చినట్లు కనబడుతున్నది.యాష్ పాండ్ వల్ల దాదాపు 300 ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి. ఎకరాకు నాలుగు పుట్లు పండాల్సిన వరి కేవలం రెండు పుట్లు పండడం బాధాకరం. జిల్లా కలెక్టర్ ఏపీ జెన్కో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రైతులను ఆదుకుంటామని అన్నారు.