సిరా న్యూస్,సికింద్రాబాద్;
పేద ప్రజలను పావులుగా వాడుకొని అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు కొంతమంది బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు అని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కన్నె ప్రకాష్ ఆరోపించారు. ఓల్డ్ బోయిన్ పల్లిలోని అస్మత్ పేట్ (బోయిని) చెరువు ప్రాంతంలో ఉన్న 400అక్రమ నిర్మాణాలకు హైడ్రా నోటీస్ ఇచ్చారు. అందులో హరిజన బస్తీ వాసులు 90మందికి కూడా నోటీసులు అందాయి. ఈ విషయం ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి వెళ్ళగా ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఈ రోజు రానున్నట్లు సమాచారం ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కలసి చెరువు కట్ట మీద మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కన్నె ప్రకాష్ అక్కడికి చేరుకొని హరిజన బస్తీ వాసులకు అండగా నిలిచారు.. ఏ నాయకుడు వచ్చినా, అధికారులు వచ్చిన హరిజన భస్థిలోకి వచ్చే మాట్లాడాలని కోరారు. కొంతమంది బీజేపీ నాయకులే 8ఎకరాల చెరువు భూమిని ఆక్రమించిన వారికి లాభం చేకూర్చడానికి కట్ట మీద మీటింగ్ పెడుతున్నారని వెల్లడించారు.. ఈ పేద ప్రజలు 40ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ స్థలంలో పట్టాలివ్వలని డిమాండ్ చేశారు.. ఎంపీ ఈటల కూడా విషయం గ్రహించి పేద ప్రజల ఇళ్ల మధ్యలోకి వచ్చి చూడాలని కోరారు..