సిరా న్యూస్, డిజిటల్:
హెచ్‌ఎం పోరెడ్డి అశోక్‌కు ఘన సన్మానం
+ బాలల సాహిత్యాన్ని ప్రొత్సహిస్తున్నందుకు దక్కిన గౌరవం
+ హైదరబాద్ తెలంగాణ రిసోర్స సెంటర్‌లో ఘన సన్మానం
+ హాజరైన ప్రముఖ్య సాహితీ వేత్తలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పోరెడ్డి అశోక్‌ను బాల చెలిమి పత్రికా అధ్వర్యంలో పలువురు సాహితివేత్తలు ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైద్రబాద్‌లోని తెలంగాణ రిసోర్స్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు డా. ఎస్ రఘు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కన్నెగంటి అనసూయ, కేంద్ర బాల సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. చొక్కాపు వెంకట రమణ, బాల చెలిమి సంపాదకులు మనికొండ వేదకుమార్, బాల సాహిత్య రచయిత గరిపెళ్లి అశోక్ తదితరులు ప్రధానోపాద్యాయులు అశోక్‌ను పూలమాలు, శాలువాలతో సత్కరించారు. బాల సాహిత్యంలో పిల్లలను ప్రొత్సహించడంలో ఆయన చేస్తున్న కృషీని గుర్తించి, సన్మానం చేసినట్లు తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో గతంలో కూర గ్రామానికి చెందిన గీస శ్రీజ అనే విద్యార్థిని కథలు రాయడం జర్గింది. దీంతో ఆమె జాతీయ యంగ్ అచీవర్ ఆవార్డ్‌తో పాటు కేంద్రం సాంస్కృతిక శాఖ ఉపకార వేతనానికి ఎంపిక కావడంతో ఆయన సేవలను గుర్తిస్తూ, సన్మానం చేసినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాద్యాలు అశోక్ మాట్లాడుతూ… తన ఆధ్వర్యంలో మరెందరో మంది విద్యార్థులు కథలు రాయడం జర్గిందన్నారు. విద్యార్థుల్లో దాగివున్న సాహిత్య ప్రతిభను బయటకు తీస్తే, అద్భుతమైన రచనలు వస్తాయన్నారు. ఈ సన్మానం తనకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.