డి టైప్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ సంబరాలు

సిరా న్యూస్,కమాన్ పూర్ (గోదావరిఖని);
జాతీయ పోషణ మాసం సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు రామగుండం అర్బన్ అధికారి స్వరూపరాని , సూపర్ వైజర్ U పుష్పలత సూచన మేరకు మంగళవారం నాడు ఎన్ టి పి సి, జ్యోతి నగర్, పి టి ఎస్ లోని డి టైప్ క్వార్టర్స్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్వాడి టీచర్ కె సుజాత శిశుసంరక్షణ ప్రతిఒక్కరిని ఆరోగ్యకరమైన శిశువుగా తయారు చేయడానికి అంగన్వాడి కేంద్రాలలో నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం అని అన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు తల్లి తండ్రులతో ప్రతిజ్ఞ చేపించారు.
ఈరోజు నేను నాదేశం లోని పిల్లలు, బాలికలు, మహిళలను పోషణ లోపం నుంచి విముక్తి చేస్తు, ఆరోగ్య వంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణాపక్షం సంధర్బంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారం, త్రాగు నీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ అభియాను ను దేశవ్యాప్త జనచైతన్యంగా మలుస్తాను, ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ నినాదాలతో మారు మ్రోగెల చేస్తాను. ఈజన చైతన్యంద్వారా నాదేశ సోదర సోదరీమణులు, పిల్లలు,సంపూర్ణ ఆరోగ్య వంతులవుతారు.మెరుగైన శక్తి సామర్ధ్యాలతో జీవితాలను సార్ధకం చేసుకుంటారు ఇదే నా ప్రతిజ్ఞ అని ప్రతి ఒక్కరి చేత చేపించించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ కె సుజాత, ప్రైమరీ పాఠశాల హెచ్ ఎమ్ అనురాధ, ఉపాధ్యాయుడు ప్రశాంత్ రెడ్డి, యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు జనగామ తిరుపతి, ఆయ పుష్ప పేరెంట్స్ జహీరభాను, స్వర్ణకుమారి, రామోజీ రావు, శ్రావ్య, ధీనమని, శంకర్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *