సిరాన్యూస్, ఓదెల
ప్రశాంత వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి: పోత్కపల్లి ఎస్సై జి. అశోక్ రెడ్డి
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోత్కపల్లి ఎస్సై జి. అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఓదెల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడారు.ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గామాత ప్రతిష్టచాలనుకునే వారు సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి అనుమతి తీసుకోవాలని, దుర్గామాత విగ్రహాల కమిటీ మెంబర్ల పేర్లు అడ్రస్, సెలఫోన్ నంబర్లు పోలీసు స్టేషన్ లో ఇవ్వాలని తెలిపారు. ఎలక్ట్రిసిటి డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ తీసుకుని కరెంటు వాడాలని చెప్పారు. దుర్గామాత మండపాల వద్ద సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించాలని తెలిపారు.విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు మండపాల అగ్ని ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇబ్బంది కలుగకుండా భక్తికి సంబంధించిన పాటలు మాత్రమే వేయాలని తెలిపారు. దుర్గ మాత విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో షీ టీం సిబ్బంది మాఫ్టీ లో గమనిస్తూ ఉంటారని చెప్పారు.