సిరా న్యూస్,రాజన్న సిరిసిల్ల జిల్లా;
విద్యుత్ బకాయలు చెల్లించకపోవడంతో వేములవాడ పురపాలక సంఘం కార్యాలయానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వేములవాడ మున్సిపల్ తరఫున సుమారు రెండు కోట్ల 60 లక్షల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండడంతో సెస్ విద్యుత్తు సరఫరా సంస్థ అధికారులు రెండు రోజుల క్రిందట మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా కట్ చేశారు. విద్యుత్ లేకపోవడంతో కార్యాలయంలో కంప్యూటర్లు లైట్లు ఫ్యాన్లు పనిచేయని పరిస్థితి ఏర్పడింది దీంతో మున్సిపల్ అధికారులు రెండు రోజులుగా జనరేటర్ ఉపయోగిస్తూ పనులు చేయాల్సి వస్తుంది. సెస్ సంస్థకు సుమారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయల మేరకు విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని బకాయిలు చెల్లించాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని దీంతో మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశామని సెస్ అధికారులు తెలిపారు.