-రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణ లో మరింత శక్తి వంతమైన పార్టీ గా అవతరిస్తుంది
-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్ట్ ఎమ్మెల్యే చంద్రుపట్ల సునీల్ రెడ్డి
సిరా న్యూస్,మంథని;
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఓటమి తో మరింత బలంగా అవుతామని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నెరవేర్చలేని పక్షం లో ప్రజల తరుపున పోరాడుతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కాంటెస్ట్ ఎమ్మెల్యే చంద్రుపట్ల సునీల్ రెడ్డి తెలిపారు.
సోమవారం మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ
మంథని లో చిల్లర రాజకీయలకు కాంగ్రెస్, బి ఆర్ స్ నాయకులు తెరలేపారని నేను శ్రీధర్ బాబు కి అమ్ముడు పోయానని బి ఆర్ ఎస్ నాయకులు, పుట్ట మధుకు అమ్ముడు పోయానని కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేశారన్నారు, కాని నన్ను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. ఒక నీతి నిజాయతి గల పార్టీ బీజేపీ అని నమ్మిన సిదాంతం కొరకు పని చేస్తామన్నారు, ఒక్క రూపాయి కూడ పంచలేదని మంథని లో మార్పు కొరకు పరితపిస్తున్ననని ఆన్నారు, మంథని లో కాలేజీ లు, ఫ్యాక్టరీ లు, హాస్పిటల్ లు రావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ కొండాపాక సత్యప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లు పూసల రాజేంద్ర ప్రసాద్, బొల్లం కిషన్, మేడిపల్లి పూర్ణ చందర్, మండల ఉప అధ్యక్షులు రేపాక శంకర్, సీనియర్ నాయకులు కొట్టె సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.