సిరాన్యూస్, ఆదిలాబాద్
శాంతి దీక్షలో ఆదిలాబాద్ జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి
గత 3 సంవత్సరాల నుండి పెండింగ్‌లోని రీ యంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర ప్రయివేటు డిగ్రీ యజమాన్యాల సంఘం నాయకులు దీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ దీక్షలో ఆదిలాబాద్ జిల్లా నాయకులు ప్రభాకర్ రెడ్డి, సురేందర్ , డా వరప్రసాద్ రావు , కార్తిక్ , రాజ్ కిరణ్ రెడ్డి, అనంత్, దేశ్ పాండే, సాజిద్, వికాస్ పాల్గొన్నారు. ఈసందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు సూర్య నారాయణ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ లో డిగ్రీ కాలేజీ లు నడపటం చాలా దుర్భరంగా ఉందన్నారు. ఇప్పటికే చాలా కాలేజ్ లు మూత పడటం జరిగిందని తెలిపారు.అధ్యాపకుల వేతనాలు ఇవ్వడం కష్టంగా మారిందన్నారు. కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీల అధ్యక్షలు పాల్గొన్నారు.