PRP: ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా లింగంగుంట రామలింగం…

సిరా న్యూస్, కుందుర్పి:

ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా లింగంగుంట రామలింగం…

ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అంతపురం జిల్లా అధ్యక్షునిగా లింగంగుంట రామలింగం ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో పార్టీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారం వైపు పయనించినప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన జిల్లా అధ్యక్షుడిని సందర్భంగా పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాలె కృపారావు, వద్ధిముక్కల సురేష్, లింగగుంట శ్రీను, పాండ్రా నాగరాజు, లింగంగుంట క్రాంతి కుమార్, మన్నెం రమేష్, సుదర్శి శ్రీను, వేల్చురి బాల కోటేశ్వరరావు, పాలేటి కోటి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *