సిరా న్యూస్, ఓదెల
రైతును రాజు చేసే ఏకైక సీడ్స్ రాశి సీడ్స్ : రాశి కంపెనీ రీజినల్ మేనేజర్ ప్రదీప్ కుమార్
* రాశి సీడ్స్‌పై రైతులకు అవగాహన
రైతును రాజు చేసే ఏకైక సీడ్స్ రాశి సీడ్స్ అని రాశి కంపెనీ రీజినల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ అన్నారు. సోమవారం రాశి సీడ్స్ వారి పత్తి పంట పై రైతు సమృద్ధి సదస్సును ఓదెల మండల కేంద్రం మారుతి ఫంక్షన్ హాల్ లో 350 మందితో కలిసి నిర్వహించారు. ఈసందర్బంగా రాశి కంపెనీ రీజినల్ మేనేజర్ ప్రదీప్ కుమార్, టీఎస్ఎం రమణారెడ్డి మాట్లాడుతూ పత్తి పంటలను ఆశించే చీడపీడలు, తెగుళ్ల పై అవగాహన కల్పించారు . అలాగే కొత్త రకమైన రాశి స్విఫ్ట్ హైబ్రిడ్ ను రైతుల సమక్షం లో ఆవిష్కరించారు . గత సంవత్సరం రాశి స్విఫ్ట్ పండించి అధిక దిగుబడులు పొందిన రైతులను సన్మానించి ప్రశంశ పత్రాలు అందించారు. అనంతరం రైతులు కొమురయ్య , మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ రాశి స్విఫ్ట్ మాకు తొందరగా పంట చేతికొచ్చి రెండవ పంట వేయడానికి అనుకూలంగా ఉందని , ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని తెలిపారు. గుడ్డి పత్తి లేని పంట పొందామని చెప్పారు . ఈ రకం రసం పీల్చే పురుగులను తట్టుకుని ,పత్తి ఏరడానికి సులువుగా ఉందని, పెట్టుబడి ఖర్చు బాగా తగ్గిందని చెప్పారు . కార్యక్రమంలో 350 మంది రైతులు, డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్, శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ ,కేడీసీఎంస్ తీర్థాల శ్రీనివాస్, కేశవా సీడ్స్ కుమార్ లు కంపెనీ సిబ్బంది , కోట శ్రీను ,గడ్డిశ్రీను ,హరీష్ , రాజశేఖర్ ,శ్యామ్ . అప్పని కుమారస్వామి.ఎం బాడి కుమార్, తదితరులు పాల్గొన్నారు.