సిరా న్యూస్, ఇచ్చోడ:
ప్రజా పాలన పథకాలను సద్వనియోగం చేసుకోవాలి
-బోథ్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ విశ్వబోధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వనియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజక వర్గ సోషల్ మీడియా ఇంఛార్జి గాయక్వాడ్ విశ్వబోధి అన్నారు. ఈ సందర్భంగా ఇచ్చోడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దగ్గరుండి అవగహన కల్పించాలని, దరఖాస్తు దారులకు సహాయంగా నిలవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు పథకాల కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆయన అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డి. రాహుల్, అవినాష్, ప్రతికార్, శిల్పకార్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.