సిరా న్యూస్, సూర్యపేట:
ప్రజాలపాలనను సద్వినియోగం చేసుకోవాలి
కాంగ్రేస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలనను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిటీసీ పాకాల రమేష్ అన్నారు. మంగళవారం ఆయన సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండలం, గానుగబండ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీక్రరణ కార్యక్రమానికి అధికారులు, నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రేస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను పకడ్బందీ అమలు కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టి నాయకులు నాగేంద్ర బాబు, అంజి రెడ్డి, నవీన్, ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.