Pramod Reddy: కేసీఆర్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

సిరాన్యూస్‌, బేల‌
కేసీఆర్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
* బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి

కెసిఆర్ ప్రభుత్వం తోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని బేల మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండలంలోని సదల్పూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, దేవన్న ఒల్లాప్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సక్కు కు మద్దతు తెలపాలని గ్రామస్తులకు ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సతీష్ యాసం, జైపాల్ రెడ్డి , దయాకర్ , మహాదవ్, భీంరావులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *