సిరాన్యూస్, ఓదెల
ముగిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ట
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహా పునఃప్రతిష్ట కార్యక్రమం బుధవారం తో ముగిసింది. బ్రహ్మశ్రీ శేషం వెంకటరమణాచార్యులు, శేషం మాధవాచార్యులు , వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహా పునః ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవముగా నిర్వహించారు. స్వామి వారికి నిత్యవిధులు, కళాన్యాస, ప్రాణప్రతిష్టా హోమములు, గర్తన్యాసము, రత్నన్యాసం, ధాతున్యాసం, పీఠపూజలు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క శివ పంచాయతన యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ట, మహా పూర్ణాహుతి, నేత్రోన్మీలనము, దిష్టికుంభము, మహా కుంభాభిషేకము, మహానివేదన, మహా పూజలు జరిపించారు. యజ్ఞ పండితులకు , శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క విగ్రహా పునః ప్రతిష్టదాతలకు సన్మానము చేసి శాలువాలు కప్పి వారిని సత్కరించారు. శ్రీ శివరామకృష్ణ భజన మండలి గట్టు దుద్దెనపల్లి వారిచే భజన కార్యక్రమము నిర్వహించారు. స్వామి వారి యొక్క పాటలు పాడుతూ అయన యొక్క ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు, భక్తులకు అర్థమయ్యేలా వివరించారు. భక్తులు వస్తు, నగలరూపాలలో స్వామివారికి కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం గ్రామ ప్రజలకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ పేరాల గోపాల్ రావు,వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి, సైదాపూర్ సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, లయన్స్ క్లబ్ చైర్మన్ కొండ వేణుమూర్తి, గట్టుదుద్దెనపల్లి ఆంజనేయ స్వామి ఆలయ చైర్మన్ శంకర్ లింగం, గ్రామ పెద్దలు దొంతుల లింగారెడ్డి, కంది రమణారెడ్డి, కొంపల్లి సుధాకర్ రెడ్డి, సారాబుడ్ల శ్రీనివాస్ రెడ్డి, బోడ సుధాకర్ రెడ్డి, సారబుడ్ల భగవాన్ రెడ్డి, మూల చంద్రారెడ్డి,పేరాల సాగర్ రావు, కంది రాజిరెడ్డి, కంది ప్రసాద్ రెడ్డి, సందుపంట్ల రవీందర్ రెడ్డి, పేరాల రవీందర్, గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.