సిరాన్యూస్, బోథ్
రైతు సంక్షేమం కోసం అనేక రుణాలు: బోథ్ సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్
బోథ్‌లో అంతర్జాతీయ సహకార దినోత్సవం
రైతు సంక్షేమం కోసం ఎన్నో రకాల రుణాలు ఇవ్వడం జరుగుతుందని బోథ్ సహకార సంఘం చైర్మన్ పదవి ప్రశాంత్ అన్నారు. శనివారం అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద చైర్మన్ పదవి ప్రశాంత్ ఏడు రంగుల జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం రైతు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు జి రాజు యాదవ్, లోలకు పోశెట్టి, జిట్ట శ్రీనివాస్, సీఈవో గోలి స్వామి, సభ్యులు పాల్గొన్నారు