సిరా న్యూస్, ఆదిలాబాద్:
అస్సాం సీఎంను కలిసిన లోక ప్రవీణ్ రెడ్డి
+ నిర్మల్ సంకల్ప్ సభలో ప్రత్యేకంగా భేటి
+ పుష్పగుచ్చం, శాలువా అందించి సన్మానం
+ పలు అంశాలపై చర్చ
+ పార్టి బలపర్చిన ఎంపీ అభ్యర్థికి గెలిపించుకుంటామని హామీ
విజయ్ సంకల్ప్ యాత్రలో భాగంగా నిర్మల్‌కు వచ్చిన అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మను, ఆదిలాబాద్ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీఎంకు పుష్పగుచ్చం, శాలువా అందించి సన్మానించారు. కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టి గెలుపే లక్ష్యంగా, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని ప్రవీణ్ రెడ్డికి సీఎం సూచించారు. పార్టీ అదిష్ఠానం ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చిన, పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కృషీ చేస్తామని లోక ప్రవీణ్ రెడ్డి సీఎంకు విన్నవించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసారు.