గర్భిణీలు,బాలింతలు పోషణ విలువలున్న ఆహార తినాలి

మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి

సిరా న్యూస్,జగిత్యాల;
గర్భిణీలు, బాలింతలు పోషణ విలువలున్న ఆహార తినాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి -లక్ష్మణ్ ఆన్నారు.. సోమవారం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని 12 వ వార్డులోని ఉప్పరపేట అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ హజరై ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు పోషణ విలువలున్న ఆహార తినాలని,పౌష్టిక పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని అంగన్వాడీలకు సూచించారు.. తల్లి బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ నక్క జీవన్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్, గర్భిణీ స్త్రీలు బాలింతలు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *