సిరాన్యూస్, తలమడుగు
మానవతా దృక్పథంతో మెలగాలి
* బ్లూ భీమ్ యూత్ అధ్యక్షుడు గొంటిముక్కుల ప్రేమెందర్
* జీవాల కోసం నీటి తొట్టె ఏర్పాటు
మానవతా దృక్పథంతో మెలగాలని బ్లూ భీమ్ యూత్ అధ్యక్షుడు గొంటిముక్కుల ప్రేమెందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త బ్లూ భీమ్ యూత్ అధ్యక్షుడు గొంటిముక్కుల ప్రేమెందర్ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మూగ జీవాల కోసం నీటి తొట్టెను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రేమెందర్ మాట్లాడుతూ ఎండలు గరిష్ట స్థాయిలో పెరుగుతున్నాయని, ఆహారం నీళ్ళు లేక పశువులు పక్షులు అల్లాడిపోతున్నాయని, కొన్ని చనిపోతున్నాయన్నారు. అందువల్ల మానవతా దృక్పథంతో నీటి తోట్టేను ఏర్పాటు చెయ్యడం జరిగిందని తెలిపారు. ఈసందర్బంగా పలువురు ఈ యువకున్ని అభినందించారు.