ఐదు సంవత్సరాల తర్వాత పూర్వ వైభవం
సిరా న్యూస్,బద్వేలు;
అన్న క్యాంటీన్లు…. కేవలం ఐదు రూపాయలకే పట్టెడు అన్నం పెట్టి పేదల ఆకలి తీర్చిన అక్షయపాత్రలు కేవలం 15 రూపాయలకే మూడు పూటలా కడుపు నింపే అన్నా క్యాంటీన్లు గత వైసిపి ప్రభుత్వ కక్ష సాధింపులకు బలయ్యాయి ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో పేదలకు అన్నం దక్కకుండా చేశాయి ఐదు సంవత్సరాలు పాటు అన్నా క్యాంటీన్లకు పట్టిన గ్రహణం ఇప్పుడు వీడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలైంది ఈనెల 15 తేదీ రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు అందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ లో కూడా అన్నా క్యాంటీన్ ముస్తాబయింది ఉమ్మడి కడప జిల్లాలో వేలాదిమంది పేదల ఆకలి తెచ్చేందుకు ప్రభుత్వం
2018 జులై 11వ తేదీ అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది జిల్లాలో కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటీల్లో మొత్తం 8 క్యాంటీన్లు ఏర్పాటు చేసింది కడప నగరంలో మూడు రాజంపేట ప్రొద్దుటూరు రాయచోటి పులివెందుల బద్వేలు జమ్మలమడుగు మున్సిపాలిటీలో ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు వీటి ద్వారా ప్రతిరోజు వేలాదిమంది పట్టణ పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం లభించేది గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వచ్చే దినసరి కూలీలకు మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లు ఆకలి తీర్చేది వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారి కూడా మధ్యాహ్నం పూట అన్న క్యాంటీన్లలో అన్నం లభించడంతో వారికి ఆర్థిక భారం తగ్గేది ఇలా ప్రతిరోజు అన్నా క్యాంటీన్ లో భోజనం లభించేది తిరిగి ఇప్పుడు అలాంటి భోజనం లభించే అవకాశం రావడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు