సిరా న్యూస్, ఏలూరు;
తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండుగ సంక్రాంతి. రైతుల పండుగాను మూడు రోజుల పాటు తెలుగు జిల్లాలో వందల కోట్లతో కోళ్లపై పందేలు ఖాస్తు డబ్బుల పండుగగా పందెం రాయుళ్లు సంక్రాంతిని జారుకుంటారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సంక్రాంతి పందేళ్లకు కోళ్లను తయారు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు, కోస్తాజిల్లాలో జరగబోయే కోడి పందెలను వీక్షించడానికి ప్రధానంగా సినీ, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు వస్తారు. 2024 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నెల రోజుల ముందు నుంచే పందెం రాయుళ్లు కోళ్లకు శిక్షణ ఇస్తున్నారు. కోళ్లను బలపరిచేందుకు వ్యాయామాలు చేయిస్తున్నారు.కోడి పందెల నిర్వాహకులు పందెం బరిలో నిలిచే కోళ్లను ఎంపిక చేసుకోవడం, వాటికి శిక్షణ, పౌష్టికాహారం శరీర పటుత్వానికి ప్రత్యేక వ్యాయామం చేయిస్తూ పందేం రాయుళ్లు కోళ్లను పందెలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోళ్లల్లో కొవ్వు తగ్గి పోవడానికి ప్రత్యేక వ్యాయామలు చేయిస్తూ బరిలో ఉన్న కోడి మీదికి ఎగురుతూ విరుచుకుపడడానికి మూడు నెలల ముందు నుంచే కోడి శరీర అకృతిని బట్టి కోడికి ఉదయం 30-40 గ్రాముల ఉడకబెట్టిన మటన్, 5 బాదం పప్పు, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జురా, ఉడికించిన గుడ్డు ముక్కలను ఆహారంగా ఇస్తున్నారు. ఇక సాయంత్రం చోళ్లు, మెరికాలు, గంతులు అందిస్తున్నారు.సంక్రాంతి పండుగకు జరగబోయే కోడి పందెలకు కోళ్లను పెంపకందారులు తయారు చేస్తున్నారు. పుంజు శరీరం గట్టిపడేందుకు నొప్పులేమైనా ఉంటే తగ్గేందుకు ప్రత్యేక ట్రైనర్లతో నీళ్ల పోతలు, శాఖలు చేయిస్తారు. ఇందుకు వేప, జామాయిల్, కుంకుడు, వెదురు, వాయిల తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాల వాటిని నీటిలో వేసి గంటల కొద్దీ మరిగిస్తారు. ఈ ద్రావణాన్ని చిన్న తొట్టెలో కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చుతారు. ఆ తర్వాత అందులో పుంజును ఉంచి పైనుంచి ద్రావణం పోస్తూ వారం రోజుల వ్యవధిలో ఒకటి రెండుసార్లు నీళ్లపోతలు చేయిస్తారు. చివరిగా శాఖల కోసం పొయ్యిపై మూకుడిని వేడి చేస్తూ.. అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దాన్ని కోడి శరీరమంతా అద్దుతారు.సంక్రాంతి పందెం బరిలో నిలబడే ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందేం రాయుళ్లు కోడి పుంజులకు శిక్షణ ఇస్తున్నారు. ఇంట్లో, తోటలలో, పొలాలు, చెరువుల వద్ద పెంచే కోడి పుంజుల కంటే ఎక్కువగా నాటుకోళ్ల కేంద్రాలలో కోడి పుంజులను కొనుగోలు చేసి వాటిని పందెలకు సిద్ధం చేయిస్తున్నారు. దేశ, విదేశాలలోని ప్రధాన నగరాల్లో స్థిరపడిన సొంత ఊరివారికీ కోడి పందెలపై ఆసక్తి, ఉత్సాహం ఎక్కువ ఉండడంతో ఆన్‌లైన్ పుంజులను కొనుగోలు చేసి పెంపకదారులకి అధిక మొత్తంలో అడ్వాన్స్ చెల్లిస్తున్నారు.కోడి పుంజులను వివిధ రంగులలో కాకి, డేగ,నెమలి, అబ్రాస్, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండు సంవత్సరాల పుంజును పందెలకు సిద్ధం చేస్తారు. ఎంపిక చేసుకున్న పుంజులకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా వాటికీ వైద్యులతో వారం రోజుల పాటు పర్యవేక్షిస్తారు. పందెం బరిలో గెలవటానికి వ్యాయామ, పౌష్టికహారం అందిస్తూ కోడి పుంజులు తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగకు మూడు నెలల ముందు నుంచే కోడి పుంజులపై లక్షలలో వ్యాపారం జరుగుతుంది.పందెనికి ఎంపిక చేసుకునే పుంజు సుమారు 50 వేల నుంచి లక్షల రూపాయల్లో డిమాండ్ ఉంటుంది. ఎంపిక చేసుకున్న పుంజు వ్యాయామనికి, పౌష్టికహారం ఖర్చు సుమారు 20 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల దాక పందెం రాయుళ్ళు ఖర్చు పెడుతున్నారు. పందెనికి పుంజును సిద్ధం చేసే ట్రైనరికి 15 నుంచి 25 వేల రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారు. ఒక కేంద్రంలో 25 నాటు కోళ్లు ఉన్న సుమారు రూ. 10లక్షల పైనే వ్యాపారం జరుగుతుంది.