సిరాన్యూస్, ఆదిలాబాద్
అతిథి ఆధ్యాపక పోస్టులకు ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ జె. సంగీత
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్ ఆదిలాబాద్ లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డా. జె. సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్ – 1, ఉర్దూ – 1, హిందీ – 2, జువాలజీ – 3, జువాలజీ ఉర్దూ మాధ్యమంలో – 1 చొప్పున ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు . అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు . ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉన్నా అర్హులేనన్నారు. నెట్, సెట్, పీ హెచ్ డి కలిగిన వారికి, బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 4వ తేదీ, బుధవారంలోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించి, 6వ తేదీ శుక్రవారం జరిగే డెమోకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.