సిరాన్యూస్,బేల
ఈనెల 17న డిగ్రీ 6వ సెమిస్టర్ : ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు
కాకతీయ యూనివర్సిటీ పరిధి లో డిగ్రీలో 6 వ సెమిస్టర్ లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వారికి ఈ నెల 17 న పరీక్ష ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అయితే దీనికి ఎవరు అర్హులు ? అనే దాని పైన కొంత సందిగ్ధత నెలకొందని, అయోమయంలో స్టూడెంట్స్ ఉండకూడదని తెలిపారు.మొదటి నుండి ఐదవ సెమిస్టర్‌లలో అన్ని పాస్ అయిన కాకున్నా కూడా ఇటీవల జరిగిన 6 వ సెమిస్టర్ లో అటెండ్ ఐ అన్ని పాస్ ఐ కేవలం ఒక్క థియరీ పరీక్ష ఫెయిల్ అయిన వారు అర్హులు అని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఎవరు అయితే అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ సంబంధిత కాలేజ్ ప్రిన్సిపాల్ లేదా పరీక్ష ఇంఛార్జి దగ్గర ఉంటుందని పేర్కొన్నారు. ఫీజు ను ఈ నెల 12 లోగా చెల్లించాలని తెలిపారు.