Principal Farhana: మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ : ప్రిన్సిపాల్ ఫర్హానా

సిరాన్యూస్‌, సైదాపూర్
మోడల్ స్కూల్ లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ : ప్రిన్సిపాల్ ఫర్హానా

సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో గల మోడల్ స్కూల్ 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ ఫర్హానా తెలిపారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ మోడల్ స్కూల్ వెబ్ సైట్ ద్వారా ఎంపీసీ ,బైపీసీ ,సీఈసీ, ఎంఈసి ,గ్రూపుల్లో ప్రవేశాల కోసం ఈనెల 25 లోపు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశం పొందిన బాలికల కోసం ఉచిత హాస్టల్ సౌకర్యం కూడా ఉందని పదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ ఫర్హానా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *