సిరాన్యూస్, చిగురుమామిడి
విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ అభినందనీయం : ప్రధానోపాధ్యాయులు పోలాడి లక్ష్మణరావు
విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమని బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానో పాధ్యాయులు పోలాడి లక్ష్మణరావు అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి బొమ్మనపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో గత ఆరు సంవత్సరాలుగా పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయురాలు పోలోజు ప్రతిమ ప్రమోషన్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా 60 మంది విద్యార్థులకు 25,000 రూపాయల క్రీడ దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఎంత సంపాదిస్తున్నం అనేది ముఖ్యం కాదు,సమాజానికి ఇవ్వడం అనేది ఎంతో ఆదర్శమైన లక్షణమ ని అన్నారు. విద్యార్థులకు ఈలాంటి లక్షణం పాఠశాల స్థాయి లో నేర్పించాలి . ఇలా బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు తను పనిచేసిన పాఠశాల నుండి ప్రమోషన్ బదిలీపై వెళ్ళినందుకు, తను వృత్తి పట్ల నిబద్ధత కలిగి , విద్యార్థులపై ప్రేమ, ఆప్యాయతలు చూపుతూ, తోటి ఉపాధ్యాయులకు గౌరవ మర్యాద లిస్తూ గుర్తుగా ఇలాంటి దుస్తులు అందజేసినందుకు పోలోజు ప్రతిమను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.శ్యామయ్య , చింతo జ్యోత్స్న, బి.శంకర్, ఎస్.రమాదేవి, వి.చంద్రశేఖర్, పి.జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.