సిరాన్యూస్, జైనథ్
జామిని పాఠశాలలో ఘనంగా హిందీ బాషా దినోత్సవం : ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల జామినిలో జాతీయ బాషా హిందీ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. హింది బాషా దినోత్సవం సందర్భంగా హిందీ ఉపాధ్యాయురాలు జయశ్రీ ని, తెలుగు ఉపాధ్యాయులు లక్ష్మణ్ లను సన్మానించారు. హిందీ బాషా ప్రాముఖ్యతను ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ తెలియజేశారు. దేవనగరి లిపిలో హిందీ బాషా ఉంది అని అన్నారు.ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్, జయశ్రీ, లక్ష్మణ్, పెంటపర్తి ఊశన్న, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.