సిరాన్యూస్, జైనథ్
పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు చదువే పునాది : ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్
పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు చదువే పునాది అని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల, జామినిలో పేరెంట్స్ టీచర్ సమావేశం నిర్వహించారు. అనంతరం అందరితో కలిసి బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి చాచా జవహర్ లాల్ నేహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్ర పటానికి పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు , ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల మాల వేసి, ఘన నివాళులు అర్పించారు.ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ మాట్లాడుతు భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి చాచా జవహర్ లాల్ నేహ్రు పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నము అని అన్నారు. పిల్లల భవిష్యత్ కు చదువే పునాది అని అన్నారు.పిల్లల పురోభివృధ్ధికి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పాత్ర కిలకం అని అన్నారు. కార్యక్రమంలో అమ్మ అదర్శ కమిటీ చైర్మన్ దేవుబాయి, జామిని మాజీ సర్పంచ్ మోహన్ ఉపాధ్యాయులు జ్యోతి, జయశ్రీ,లక్ష్మణ్, దుస గంగన్న, పెంటపర్తి ఊశన్న, మునాహిద్, అనుసూయ, పోచ్చిరాం గ్రామస్తులు మారుతీ, ఇందు, యశోద, రాంకిషన్ విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.