సిరాన్యూస్,బేల
ప్రిన్సిపాల్ సూర్య ప్రకాష్ కు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లా బేల కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ బదిలీపై వెళ్లిన సూర్య ప్రకాష్ ను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈసందర్బంగా విద్యార్థులు, అధ్యాపకులు శాలువా పూల బొక్కెలతో ఘనంగా సత్కరించి వీడుకోలు పలికారు. అనంతరం మారుమూల ప్రాంతంలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారంటూ ఆయన సేవలను వక్తలు కొనియాడారు. కళాశాలను కార్పొరేట్ కు దీటుగా మర్చి ఉన్నత ఫలితాలు సాధించేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భగవాన్లు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.