సిరాన్యూస్, భీమదేవరపల్లి
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
* బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
* మండల తహసీల్దార్‌కు వినతి
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీజేపీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. సోమవారం మండల తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో రైతులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. మండలంలో కొన్ని చోట్ల సరైన సమయంలో సాగు నీరు వదలకపోవడంతో పంటలు ఎండిపోయాయని, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టం జరిగిందని తెలిపారు. పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ.10 వేలు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు పరిహారం అందలేదని, వెంటనే పరిహారం అందించి రైతులకు ఉపశమనం కలిగించాలని కోరారు. ఒక్కో ఎకరాకు రూ.20 నుండి రూ.30 వేల వరకు పెట్టుబడి ఖర్చులవుతున్నందున ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల పరిహారం రైతులకు ఏమాత్రం సరిపోదన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమం లో సీనియర్ నాయకులు దొంగల కొమురయ్య, జిల్లా కార్యదర్శి మాచర్ల కుమార్, శ్రీరామోజు శ్రీనివాస్, వేణు, అంబీర్ కవిత, మెట్టు అశోక్ రావు, పిల్లి రవీందర్, భిక్షపతి బైరి సదానందం, సతీష్, పాపారావు, నాగవెల్లి సంపత్, రాజేందర్, అలుగు భాస్కర్, మోలుగు సంపత్.శ్రీనాధ్. వినోద్, విజయ్. మాధవి, రాజమ్మ. కవిత. త్రిజ్ఞానేశ్వర్ ఉదయ్, జకనపెల్లి రాజు. తదితరులు పాల్గొన్నారు.