సిరాన్యూస్,భీమదేవరపల్లి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: బీజేపీ మండల అధ్యక్షులు పృథ్విరాజ్ గౌడ్
పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆదుకోవాలని బీజేపీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. శనివారం భీమాదేవరపల్లి మండలంలో కొత్తకొండ గ్రామంలో పంట పొలాల దగ్గర కు వెళ్లి తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు సెంటర్లలో కొనుగోలు త్వరగా జరగకపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి కటింగ్ లు లేకుండా తడిధాన్యం కొనుగోలు చేసి క్వింటాలు కు 500/-రూ”ల బోనస్ ప్రకటించాలన్నారు. నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 లక్షలు రుణమాఫీ వెంటనే ప్రకటించాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గండు సారయ్య, మండల ప్రధానకార్యదర్శులు గుండెల్లి సదానందం, గోదాల సంపత్, శ్రీరామోజు శ్రీనివాస్, దొంగల వేణు, వేముల ప్రసాద్, బండారి కర్ణాకర్, అయిత సాయి, రాణా ప్రతాప్, మాడ్గుల దయాకర్, కంకల సదానందం, బొజ్జపురి పృథ్వీరాజ్, లక్కీరెడ్డి మల్లారెడ్డి, సోప్పరి నవీన్, గుంటి ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.