సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం, మహబూబ్ ఘాట్స్ పై ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఘటన జరిగింది. 25 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరినీ హైదరాబాద్ తరలిస్తుండగా అదిలాబాద్ పట్టణానికి చెందిన ఫర్హనా అనే 28 సం.ల మహిళ మృతి చెందింది. క్షతగాత్రులను నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
================