-మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి
సిరా న్యూస్,మంథని;
అంగన్వాడీ కేంద్రాలలో సరైన బోధనా పద్ధతులు పాటించాలని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం మంథని పట్టణంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంథని మహిళా మండలి కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు ఫ్రీ స్కూల్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి, ఎంపీపీ కొండా శంకర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలని, ఆటపాటలతో అర్థమయ్యే విధంగా బోధన చేయాలని సూచించారు.ప్రభుత్వ నిబంధనలో మేరకు అది ఒక్కరూ విధులపై బాధ్యతగా సమయపాలన పాటిస్తూ ప్రణాళికతో అంగన్వాడి కేంద్రాల నిర్వహణను కొనసాగించాలన్నారు. అనంతరం సిడిపిఓ స్వరూప మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న సంస్కరణల కారణంగా అంగన్వాడి కేంద్రాలకు నూతన శోభ సంతరించుకుంటుందని.ఈ విద్యా సంవత్సరం నుండి నూతనంగా అంగన్వాడి కేంద్రాల్లో 3-6 ఏండ్ల వయసు ఉన్న వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించనున్నారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సిపతి బాణయ్య కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ అనిల్, సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.