సిరా న్యూస్,మొయినాబాద్;
మొయినబాద్ మండలం కనకమామిడి గ్రామ రెవెన్యూలో గల హ్యాపీ హోమ్ వెంచర్ లోని రాజు ఫార్మ్ హౌస్ పై తెల్లవారుజామున ఎస్వోటీ పోలీసుల దాడి జరిగింది. పది మంది వ్యక్తులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఒకటి రెండు నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార కేంద్రంపై పోలీసులకు సమాచారం అందింది.దాంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ఏడుగురు యువకులను, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని మొయినబాద్ పోలీసులకు అప్పగించారు. ఇందులో శ్రీనివాస్, రాజు ఆర్గనైజర్స్ కాగా రామకృష్ణ, సంతోష్, రమాకాంత్, అభిలష్ రెడ్డి విటులు,వాచ్ మెన్ సంపత్ లను అరెస్టు చేయడం జరిగింది.