పిల్లల మహిళల రక్షణకు పెద్దపీట వేయాలి

హాట్ స్పాట్స్ వద్ద కంప్లైంట్ బాక్స్లు ఏర్పాటు చేయాలి
సిరా న్యూస్,సిద్దిపేట;
షీటీమ్ భరోసా సెంటర్ స్నేహిత సిబ్బందికి కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. షీ టీమ్, భరోసా, స్నేహిత, సిబ్బంది అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి మహిళల పిల్లల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు. గుర్తించిన ఈవిటీజింగ్ తదితర కార్యక్రమాలు జరిగే గుర్తించిన హాట్స్పాట్ వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ప్రతిరోజు స్కూల్లో కాలేజీలు తదితర ప్రాంతాలలో మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి మహిళల భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హాట్స్పాట్ పరిసర ప్రాంతాలలో షీటీమ్ కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలని మహిళా ఇన్స్పెక్టర్ దుర్గా కు సూచించారు. షీటీమ్ జిల్లా నెంబర్, మరియు షీటీమ్ సిబ్బంది నెంబర్లు కాలేజీలు స్కూల్ ల వద్ద పిల్లలకు కనబడే విధంగా చిన్న చిన్న బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కోమటి చెరువు, పాండవుల చెరువు, ఆక్సిజన్ పార్క్, రాజీవ్ పార్క్, అర్బన్ పార్క్,, బస్టాండ్ల వద్ద, స్కూల్లో కాలేజీల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. భరోసా సెంటర్ సిబ్బంది కూడా తరచుగా షీ టీమ్ కార్యక్రమంలో పాల్గొని మైనర్ అమ్మాయిలకు అందిస్తున్న సేవలు గురించి వివరించాలని సూచించారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు.
మైనర్ అబ్బాయిలు అమ్మాయిలు కనబడితే కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. కౌన్సిలింగ్ నిర్వహించే సమయంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం హాట్స్పాట్ వద్ద విసిబుల్ పోలింగ్ విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, మూడు డివిజన్ల షీ టీమ్ సిబ్బంది, సిద్దిపేట భరోసా సెంటర్ సిబ్బంది, మహిళ స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *