సిరా న్యూస్,ఒంగోలు;
ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఆశా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాదని సిఐటియు నేత దగ్గుబాటి నేత సోమయ్య అన్నారు. గురువారం మార్కాపురం పోలీస్ స్టేషన్ లో అరెస్టులకు నిరసనగా ఆందోళన చేశారు. ఆశా కార్యకర్తలను, సిఐటియు నేతలను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. చలో విజయవాడ కు వెళ్లనివ్వకుండా పోలీసులు మార్కాపురంలో 18 మంది ఆశాలను,2 సిఐటియు నేతలు, అలాగే గుంటూరులో 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.