Protest against MPs: ఉప రాష్ట్రపతిని అవమానించడం దురదృష్టకరం..ఖండించిన బిజెపి గిరిజన మోర్చా

  సిరాన్యూస్,ఇంద్రవెల్లి:

 ఉప రాష్ట్రపతిని అవమానించడం దురదృష్టకరం

+ఖండించిన బిజెపి గిరిజన మోర్చా

+ ఇంద్రవెల్లిలో నల్ల బ్యాడ్జిలతో నిరసన..

పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతిని అవమానించడం దురదృష్టకరమని, బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మరప రాజు అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఇండియా కూటమి తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ  60 ఏళ్ళు  పాలించిన పార్టీ రాజ్యసభ చైర్మన్ వ్యవస్థను ఇంత దారుణంగా అవమానించడం సిగ్గుచేటుఅని అన్నారు. విపక్ష సభ్యులు తమ ప్రవర్తనతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను దారుణంగా హేళన చేశారని అని మండిపడ్డారు. ఈ చర్యతో విపక్ష ఇండియా కూటమి సంస్కారం అట్టడుగుకు దిగజారిందన్నారు. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ ను అవమానించిన త్రుణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపి ఉపరాష్ట్రపతిని అవమానించడాన్ని, రాజ్యసభలో ఎంపీలు అనుచితంగా ప్రవర్తించడం వల్లే రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారన్నారు. రాజ్యసభ చైర్మన్ ఆదేశాలను పాటించకుండా ఉపరాష్ట్రపతి సభను నడిపించే తీరును అపహాస్యం చేస్తూ బాధ్యతగల ఎంపీలు అవమానించడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడమెనని అన్నారు. పార్లమెంటుపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేని ఎంపీలను శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ  కార్యక్రమంలో బిజెపి మండల నాయకులూ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *