సిరా న్యూస్,మెదక్;
నర్సాపూర్ నియోజకవర్గంలో మరోసారి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ప్రోటోకాల్ గొడవ జరిగింది. శివంపేట (మం) పెద్దగొట్టిముక్కుల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ డైరెక్టర్ ప్రారంభించడంతో వివాదం చెలరేగింది. ఎమ్మెల్యే రాకుండా ఎలా ప్రారంభిస్తావంటూపీఏసీఎస్ డైరెక్టర్ తో బీఆర్ఎస్ నాయకులు ధ్య వాగ్వాదానికి దిగారు. పోటీగా శివంపేట పీఏసీఎస్ S ఆఫీస్ వద్ద మరో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నిత్యం ఏదో చోట ప్రోటోకాల్ పేరుతో గొడవకు దిగుతున్నారు.