PRTU: సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసిన పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా నాయ‌కులు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసిన పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా నాయ‌కులు

ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించినందుకు గాను ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్‌క్ల‌బ్‌లో పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా శాఖ ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు. ఈసంద‌ర్బంగా జిల్లా అధ్యక్షులు ఆడే నూర్ సింగ్ , జిల్లాప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్ మాట్లాడారు. రెండు దశబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న భాష పండితుల ,వ్యాయామ ఉపాధ్యాయుల అప్గ్రేడేషన్ పూర్తి చేయించిన సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతా పూర్వకంగా  సందర్బంగా పాలాభిషేకం చేశామ‌ని తెలిపారు.రాబోవు కాలంలో ఎస్‌జీటీ, ఉపాధ్యాయులకు 5500 పైగా పీఎస్‌హెచ్ఎం పోస్టులు శాంక్షన్ చేయించి ఎస్‌జీటీ ఉపాధ్యాయుల కోరిక తీర్చే బాధ్యత, డీఎస్‌సీ -2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇప్పించే బాధ్యత పీఆర్‌టీయూ తెలంగాణ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో , రాష్ట్రకార్యదర్శి మోహన్ సింగ్, జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరిబాబన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాష్ ,ముజీబ్, సంతోష్, పొచన్న, దినేష్, అంబాజీ, రాజేందర్, అర్జున్, జీవన్, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *