లూపిన్ ఫార్మా వారిచే స్కూల్ విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

సిరా న్యూస్,పరవాడ;
పరవాడ మండలలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల తాణం గ్రామంలో మరియు మునగపాక మండలలోని తోటాడ జెడ్పి హైస్కూలులో సామాజిక సేవలో భాగంగా ఫార్మా కంపెనీ లూపిన్ వారు ఇటీవల లూపిన్ ఫౌండేషన్ నుంచి 08 & 09 ఫిబ్రవరి 2024 లో నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న విద్యార్థులకు బుధవారం కళ్ళద్దాలను పంపిణీ చేశారు.జిల్లా పరిషత్ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు బి కుమార్ మరియు తానం పీన్సిపాల్ సిహెచ్ అప్పల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లూపిన్ ఫౌండేషన్ డిజిఎం హెచ్ఆర్ ఎన్ శ్రీనివాసరావు,ఎఫ్ఎంఓ ఎస్ సురేష్ బాబు,సీఎస్ఆర్ మేనేజర్ డి వెంకట నారాయణలు పాల్గొని పిల్లలకు వాటిని అందజేస్తూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *