జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్
సిరా న్యూస్,సిద్దిపేట;
గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణ కు సంభందించి డిపార్ట్మెంట్ అధికారులు, ప్లైయుంట్ స్క్యార్డు, ఐడెంటిఫికేషన్ ఆపిసర్లతో జిల్లా అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 పరీక్ష ఈనెల 24 నుండి 29వ తేది వరకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష జూన్ 30వ తేదీ నుండి జూలై 4వ తేది వరకు పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎక్సమ్ రోజు రెండు సెక్షన్లవారిగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మధ్యాహ్నం 2:30 నిమిషాల నుండి సాయంత్రం 5గంటల వరకు నిర్వహణ జరుగుతుంది.
జిల్లాలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ 3296 మంది డివిజినల్ అకౌంట్ ఆపిసర్ 1250 మంది అభ్యర్థులు 2సెంటర్ లలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో హస్టల్ వెల్పేర్ ఆపిసర్ మరియు మరియు డివిజినల్ అకౌంట్ ఆపిసర్ పరీక్షలకు జిల్లాలొ గల 2 సెంటర్ లలో అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావునా ప్రతి కంప్యూటర్ లో ఓక రోజు ముందు మాక్ టేస్ట్ నిర్వహించాలి. సెంటర్లలో సిసి కెమెరాల పిట్టింగ్, సరిపడా ఫర్నిచర్, టాయ్ లెట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇలా ప్రతిది చెక్ చెయ్యాలి. పవర్ కట్ లేకుండా జూన్ 23 నుండి జూలై 4వరకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చెయ్యాలని విద్యుత్ శాఖ అదికారులకు తెలిపారు. కంప్యూటర్ లో పరీక్ష కావునా అనుకొని విపత్తులు ఎదురైన పవర్ కట్ కాకుండా జనరేటర్ల ఏర్పాటు తప్పనిసరి ఉండాలి. అభ్యర్థులు ఉదయం 8:30నుండి 9:30 మధ్యాహ్నం 1:00నుండి 2గంటల మధ్య పూర్తిగా చేక్ చేశాకే సెంటర్ లోపలకి అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ మొబైల్ ఫోన్స్, నార్మల్ గడియారాలు, బంగారు ఆభరణాలు మరి ఇతర ఎలాంటి వస్తువులు లోపలికి అనుమతించబడవు. అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని రిసెంట్ పాస్ – ఫోటో అతికించాలి.
అభ్యర్థులకు సకాలంలో ఎగ్జామ్స్ సెంటర్ కు చేరే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు, సెంటర్లలో హెల్త్ డెస్క్ తో పాటు ఆశా ఎఎన్ఎం ను ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అధికారులకు తెలిపారు. ఎగ్జామ్స్ సెంటర్ల చుట్టూ 144 సెక్షన్ అమలు చేసి చుట్టూ జిరాక్స్ సెంటర్లు మూసివేసేల చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏఆర్ సుభాష్ చంద్రబోస్, ఆయా సెంటర్ కళాశాల ప్రిన్సిపల్లు విపి రాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
===================