సిరాన్యూస్, సామర్లకోట
పులిమేరులో ఉపాధి హామీ గ్రామ సభ
పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే పనులు గత ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నారని తెలుసుకొని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి, ఊరు బాగుకోసం ప్రతి ఒక్కరూ సలహాలు తీసుకుని ఉపాధి హామీ పనులను పక్కదారి పట్టించకుండ ఊరు అభివృద్ధికి కృషి చేసి విధంగా పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశానుసారం పెద్దపురం మండలం పులిమెరు గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు,గ్రామ సర్పంచ్ తుమ్మల సురేఖ నాని ,బీజేపీ మహిళ మోక్ష అధ్యక్షురాలు తుమ్మల పద్మజ,సెక్రటరీ రమణ తదితరులు పాల్గొన్నారు.